ఐపీఎల్ సీజన్ 17 లో( IPL 17 ) భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ టీమ్ ల మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.ఇక ఈ రెండు టీం లను కనక చూసుకున్నట్లైతే రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals ) ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో తో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.
ఇక గుజరాత్ టైటాన్స్( Gujarat Titans ) మాత్రం 5 మ్యాచ్ లు ఆడితే అందులో 2 విజయాలు నమోదు చేసుకొని, 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.ఇక ఈ టీం కేవలం 4 పాయింట్లతో నెంబర్ సెవెన్ పొజిషన్ లో కొనసాగుతుంది.
![Telugu Gujarat Titans, Ipl, Josh Buttler, Rashid Khan, Rr Gt, Rr Gt Analysis, Sa Telugu Gujarat Titans, Ipl, Josh Buttler, Rashid Khan, Rr Gt, Rr Gt Analysis, Sa](https://telugustop.com/wp-content/uploads/2024/04/ipl-2024-rajasthan-royals-vs-gujarat-titans-match-analysis-detailsa.jpg)
ఇక ఇదిలా ఉంటే ఈ ఈరోజు జరిగే మ్యాచ్ లో ఏ టీమ్ విజయం సాధించబోతుంది అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది.అయితే రాజస్థాన్ రాయల్స్ టీం గత నాలుగు మ్యాచ్ లను కనక చూసుకున్నట్లైతే మంచి పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా అందులో ఆడే ప్లేయర్లందరు టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటూ వస్తున్నారు.ఇక ఇంతకుముందు బెంగళూరు మీద జరిగిన మ్యాచ్ లో జోష్ బట్లర్( Josh Buttler ) సెంచరీ చేసి టీమ్ కి విజయాన్ని అందించాడు.ఇక అంతకుముందు వరకు ఆయన పెద్దగా ఆడలేదు.
కానీ ఆ మ్యాచ్ లోనే ఆయన ఫామ్ లోకి వచ్చి సెంచరీ చేయడం అనేది ఆ టీమ్ విజయంలో కీలక పాత్ర వహించాడనే చెప్పాలి.ఇక అలాగే సంజు శాంసన్, రియల్ పరాగ్ లాంటి ప్లేయర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.
![Telugu Gujarat Titans, Ipl, Josh Buttler, Rashid Khan, Rr Gt, Rr Gt Analysis, Sa Telugu Gujarat Titans, Ipl, Josh Buttler, Rashid Khan, Rr Gt, Rr Gt Analysis, Sa](https://telugustop.com/wp-content/uploads/2024/04/ipl-2024-rajasthan-royals-vs-gujarat-titans-match-analysis-detailss.jpg)
ఇక బౌలింగ్ విషయానికి వస్తే రవిచంద్రన్ అశ్విన్,( Ravichandran Ashwin ) ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన బౌలింగ్ వేస్తూ తమ సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు.ఇక గుజరాత్ టైటాన్స్ టీం విషయానికి వస్తే శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ టీంలో ఉన్నారు.అయినప్పటికీ వీళ్లు అనుకున్న రేంజ్ లో మాత్రం తమ పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు.ఇక ఈ మ్యాచ్ ను కనక చూసుకున్నట్లైతే రాజస్థాన్ రాయల్స్ టీం కి 70% గెలిచే అవకాశం ఉంటే, గుజరాత్ టైటాన్స్ కి కేవలం 30% మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి…
.