సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్( Allu Arjun ) నేడు పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకుంటున్నారు.అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ క్రేజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.
ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున తన సినిమా నుంచి అప్డేట్స్ అవ్వడమే కాకుండా సినిమా సెలబ్రిటీలు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరు సెలబ్రిటీలు కూడా నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు అయితే వారి పేర్లు కూడా A తోనే మొదలవ్వడం విశేషం.
మరి అల్లు అర్జున్ తో పాటు నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఆ సెలబ్రెటీలు ఎవరు అనే విషయానికి వస్తే వారికి మరెవరో కాదు ఒకరు అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కుమారుడు అకీరా( Akira ) .నేడు అఖిల్ పుట్టినరోజు కావడంతో అభిమానులు అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక నేడు ఈయన కొత్త సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్స్ తెలియజేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తరుణంలో పవన్ ఫ్యాన్స్ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.