వేశ్య పాత్ర చేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది.. శోభిత కామెంట్స్ వైరల్!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా సక్సెస్ అయిన వారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.అయితే తెలుగులో కూడా ఎంతో టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నారు కానీ వారి టాలెంట్ మాత్రం తెలుగువారు సరైన రీతిలో ఉపయోగించుకోలేదు కానీ ఇతర భాష చిత్రాలలో మాత్రం తెలుగమ్మాయిలు అదరగొడుతున్నారు.

 Sobhita Dhulipala Sensational Comments About Her Call Girl Role In Monkey Man Mo-TeluguStop.com

ఇలాంటి వారిలో శోభిత ధూళిపాళ్ల ( Sobhita Dhulipala ) ఒకరు.ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ హిందీ భాష చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తూ హీరోయిన్గా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి శోభిత ఇటీవల నటించిన హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్( Monkey Man ) ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ హాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలై మూడు రోజులలోనే బ్రేక్ ఈవెంట్ సాధించింది.ఇక ఈ సినిమా తెలుగులో ఏప్రిల్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శోభిత మంకీ మ్యాన్ సినిమాలో తన పాత్ర గురించి తెలియజేశారు.ఈ సినిమాలో తాను సీత అనే వేశ్య పాత్ర( Call Girl ) పోషించాను.ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను.

ఈ మంకీ మ్యాన్‌ సినిమాలో నా పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంది.అలానే సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కూడా మంచిగా ఉంటుందని భావిస్తున్నాను ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో ఎలాంటి పాత్రలలోనైనా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube