అందరికీ అన్ని నచ్చాలని లేదుగా... ట్రోల్స్ పై రష్మిక కామెంట్స్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandana ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు రణబీర్ కపూర్( Ranbir Kapoor )తో కలిసి ఈమె నటించిన యానిమల్ ( Animal ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మధ్య సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Finally Rashmika React On Animal Movie Trolls , Rashmika, Ranbir Kapoor, Animal-TeluguStop.com

ఈ సినిమాలో ఈమె గీతాంజలి పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాలో రష్మిక పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు రాగ మరికొందరు విమర్శలు కూడా చేశారు.

ముఖ్యంగా ఈ సినిమాలోని కర్వాచౌత్ సన్నివేషంలో రష్మికపై భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.

Telugu Animal, Bollywood, Finallyrashmika, Ranbir Kapoor, Rashmika-Movie

ఈ పండుగ సందర్భంగా వచ్చే సన్నివేశాలలో రష్మిక డైలాగ్స్( Rashmika Dialogues ) సరిగా చెప్పలేదు అంటూ ఈమె గురించి ఎంతోమంది ట్రోల్స్ చేశారు.అయితే ఈ ట్రోల్స్( Trolls ) గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.

యానిమల్ సినిమాలో కొన్ని సన్నివేశాలలో నా డైలాగ్స్ బాలేవని నా ముఖం అలాగే హావభావాలు కూడా సరిగా లేవని చాలామంది విమర్శలు చేశారు.

Telugu Animal, Bollywood, Finallyrashmika, Ranbir Kapoor, Rashmika-Movie

ఇలా విమర్శలు చేసినటువంటి సన్నివేశాలలో కార్వా చౌత్ సన్నివేశం( Karva Chauth Scene ) ఒకటని తెలిపారు.నిజానికి ఈ సీన్స్ సినిమాకి చాలా హైలెట్ గా మారిందని రష్మిక తెలిపారు.నటిగా తాను ఒక సన్నివేశం చేయాలి అంటే ఎన్నో హావభావాలను పలికించాల్సి ఉంటుంది అలా చేయడం కోసం నేను ఎంత కష్టపడతానో నాకు మాత్రమే తెలుసు.

ఇక ఎలాంటి సన్నివేశాలలో ఏ విధంగా నటించాలో నాకు తెలుసని ఈమె తెలిపారు.అయినా ఎవరి అభిరుచులు వారివి అన్నీ అందరికీ నచ్చాలని రూలేమీ లేదు కదా అంటూ ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పట్ల రష్మిక స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube