వేశ్య పాత్ర చేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది.. శోభిత కామెంట్స్ వైరల్!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా సక్సెస్ అయిన వారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.

అయితే తెలుగులో కూడా ఎంతో టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నారు కానీ వారి టాలెంట్ మాత్రం తెలుగువారు సరైన రీతిలో ఉపయోగించుకోలేదు కానీ ఇతర భాష చిత్రాలలో మాత్రం తెలుగమ్మాయిలు అదరగొడుతున్నారు.

ఇలాంటి వారిలో శోభిత ధూళిపాళ్ల ( Sobhita Dhulipala ) ఒకరు.ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ హిందీ భాష చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తూ హీరోయిన్గా ఎంతో బిజీగా గడుపుతున్నారు. """/" / ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి శోభిత ఇటీవల నటించిన హాలీవుడ్ చిత్రం మంకీ మ్యాన్( Monkey Man ) ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ హాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలై మూడు రోజులలోనే బ్రేక్ ఈవెంట్ సాధించింది.

ఇక ఈ సినిమా తెలుగులో ఏప్రిల్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

"""/" / ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శోభిత మంకీ మ్యాన్ సినిమాలో తన పాత్ర గురించి తెలియజేశారు.

ఈ సినిమాలో తాను సీత అనే వేశ్య పాత్ర( Call Girl ) పోషించాను.

ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను.ఈ మంకీ మ్యాన్‌ సినిమాలో నా పాత్రకు అధిక ప్రాధాన్యం ఉంది.

అలానే సినిమాకి ప్రేక్షకుల ఆదరణ కూడా మంచిగా ఉంటుందని భావిస్తున్నాను ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో ఎలాంటి పాత్రలలోనైనా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పుష్ప ది రూల్ సక్సెస్ క్రెడిట్ సుకుమార్ రెడ్డిదే.. వైరల్ అవుతున్న బన్నీ కామెంట్స్!