వీడియో: బిల్డింగ్‌లో మంటలు.. చిక్కుకుపోయిన కుక్క.. కాపాడిన యువతి..

కొన్నిసార్లు మూగజీవులు అనుకోకుండా ప్రమాదాల్లో పడుతుంటాయి.వీటిని యజమానులు ప్రాణాలకు తెగించి కాపాడుతుంటుంటారు.

 Woman Saves Dog Stuck Inside Burning Building Details, Viral Video, Dog Video, V-TeluguStop.com

మరి కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టలేక అలానే మౌనంగా ఉండిపోతారు.దీనివల్ల మూగ జంతువులు బలైపోతుంటాయి.

అయితే ఇటీవల ఒక 21 ఏళ్ల యువతి తన సోదరి కుక్కను( Dog ) కాపాడటానికి మంటల్లోకి దూకింది! వినడానికి కష్టంగా ఉన్న ఇది నిజం.ఆ యువతి మంటల్లో( Fire ) చిక్కుకున్న తన సోదరి ఇంటి నుంచి కుక్కను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది.

రెస్క్యూ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది, చాలా మందిని కదిలించింది.

తన సోదరి ఇల్లు మంటల్లో చుట్టుముట్టి ఉన్నప్పుడు, ఆ యువతి వెనుకాడలేదు.ప్రమాదం ఉన్నప్పటికీ, ఆమె చిక్కుకున్న కుక్కను రక్షించడానికి( Saving Dog ) లోపలికి దూసుకెళ్లింది.కుక్క ఒక బోనులో చిక్కుకుని ఉంది కానీ సమయం చాలా తక్కువగా ఉంది.

అయినా ఆమె దానిని ధైర్యంగా బయటికి తీసుకు రాగలిగింది.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ షేర్ చేసింది.

ఆ మహిళ నిస్వార్థతకు నెటిజన్లు చలించిపోయారు.ఆమె ధైర్యసాహసాలు, కరుణను పలువురు కొనియాడారు.

పోస్ట్ చేసినప్పటి నుండి, వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.52,000 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.కొందరు ఆమెను “వండర్ వుమన్”, “నిజమైన ఏంజెల్” అని కూడా పిలిచారు.ఆమె ఒకవేళ రక్షించడానికి ముందుకు రాకపోతే కుక్క సజీవ దహనం అయి ఉండేదని మరి కొందరు కామెంట్లు చేశారు.

ఈమెకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే యానిమల్ లవర్స్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube