సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ఒకరితో చేయాలనుకొని ఫిక్స్ అయిపోయి మరొక హీరో తో చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు అలా సినిమాలు చేస్తూ చాలా మంచి సక్సెస్ లను అందుకుంటారు.
ఇక ఇలాంటి క్రమంలో డైరెక్టర్ పరుశురాం ( Director Parusuram )నాగచైతన్యతో ఒక సినిమా చేయాల్సి ఉంది.అయితే ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న క్రమంలోనే మహేష్ బాబు నుంచి ఆయనకు పిలుపు రావడంతో ఆ సినిమాను వదిలేసి మహేష్ బాబు తో ‘సర్కార్ వారి పాట’ అనే సినిమా చేశాడు.
అయితే ఈ క్రమంలోనే నాగచైతన్య పరుశురాం చేసిన పనికి హర్ట్ అయ్యాడు.
ఇక సర్కార్ వారి పాట సినిమా( Sarkaru vari pata ) రిలీజ్ అయిన తర్వాత అది యావరేజ్ గా ఆడింది.ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య( Naga Chaitanya ) తో చేయాల్సిన సినిమాని స్టార్ట్ చేయాలని పరుశురాం అనుకున్నాడు.కానీ నాగచైతన్య దానికి ఒప్పుకోలేదు దాని వల్ల ఆ ప్రాజెక్టు అనేది అలాగే ఆగిపోయింది.
ఇక అల్లు శిరీష్ ని గాని, లేదా మిగతా వేరే హీరోని గానీ పెట్టి గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తానని అల్లు అరవింద్ ( Allu Arvind )కి కమిట్ అయ్యాడు.అయితే ఆ బ్యానర్ ని వదిలేసి మళ్లీ దిల్ రాజు బ్యానర్( Dil Raju banner ) లోకి వచ్చి విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేయడం వల్ల అల్లు అరవింద్ కూడా పరుశురాం మీద చాలా వరకు కోపంతో ఉన్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ( ‘Family Star’ movie) ప్లాప్ అవ్వడం తో ఇప్పుడు నాగ చైతన్య, అల్లు అరవింద్ చాలా హ్యపీ గా ఉన్నారు అంటూ కొంత మంది సినీ మేధావులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక మొన్నటి వరకు పరుశురాం అంటే ఒక డీసెంట్ డైరెక్ట్ అనే పేరు అయితే ఉండేది.ఇక ఇప్పుడు ఆయన వాళ్ళతో గొడవలు పెట్టుకొని తన పేరును బ్యాడ్ అయితే చేసుకున్నాడు…
.