ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5G( Infinix Note 40 Pro 5G ) స్మార్ట్ ఫోన్ మైమరిపించే ఫీచర్లతో ఏప్రిల్ 12వ తేదీ భారత మార్కెట్లో లాంచ్ కానుంది.ఈ హ్యాండ్ సెట్ అనేక అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానుంది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5G స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.78 అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ ప్లే తో ఉంటుంది.Cheetah X1 చిప్ ను కలిగి ఉంది.120Hz రిఫ్రెష్ రేట్,1500Hz ఇన్ స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.నోట్ 40 సిరీస్ హ్యాండ్ సెట్ లు ప్రీమియం డిజైన్, ప్రీమియం వెగాన్ లెదర్, గ్లాస్ ఫినిష్, 55 డిగ్రీల గోల్డెన్ కర్వేచర్ ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ( Battery ) విషయానికి వస్తే.40ప్రో సిరీస్ X1 cheetah చార్జింగ్ చిప్ బ్యాటరీ పనితీరు డ్యామేజ్ కాకుండా ఫాస్ట్ చార్జింగ్( Fast Charging ) అందిస్తుంది.ఈ హ్యాండ్ సెట్ Muti Mode ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ ను కలిగి ఉంది.ఈ ఫోన్ మూడు చార్జింగ్ మోడ్ లు, హైపర్ ఛార్జ్ తో వస్తుంది.
నోట్ 40ప్రో వేరియంట్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 45W ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.నోట్ 40ప్రో ప్లస్ వేరియంట్ 4600mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 100W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
ఈ రెండు వేరియెంట్లు కూడా 20W వైర్ లెస్ Magcharge సపోర్టు కలిగి ఉంటాయి.ఈ ఫోన్ కు కార్నింగ్ గ్లాస్ రక్షణగా ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.3x జూమ్,OIS సపోర్ట్ తో 108ఎంపీ కెమెరాతో ఉంటుంది.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ కెమెరాతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు లాంచింగ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.