ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) అన్నారు.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు కోరుకుంటున్న మార్పు తప్పక వస్తుందని తెలిపారు.
కేంద్రంలో బీజేపీ( BJP ) సర్కార్ మరోసారి రావడంతో పాటు ఏపీలోనూ కూటమి అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.అనంతరం దేవాదాయ శాఖకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు.ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని తెలిపారు.