ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) పర్యటించనున్నారు.ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుమ్ పూర్( Mugdhumpur ) లో పంట పొలాలను ఆయన పరిశీలించనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.30 గంటల మాజీ మంత్రి గంగుల కమలాకర్( Former minister Gangula Kamalakar ) నివాసంలో కేసీఆర్ భోజనం చేయనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లికి వెళ్లనున్నారు.అక్కడ ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శించనున్న కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు.కాగా ఈ పర్యటనలో భాగంగా నీళ్లు అందక ఎండిపోయిన పంటలను పరిశీలించి గులాబీ బాస్ కేసీఆర్ రైతులకు భరోసా కల్పించనున్నారు.







