సూర్యాపేట జిల్లా: వరంగల్,ఖమ్మం,నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పట్టభద్రుల ఓటర్ల తుది జాబితాను గురువారం ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల వారీగా నమోదైన ఓటర్ల వివరాలను ప్రకటించారు.సూర్యాపేట-26059,కోదాడ-12120,హుజూర్ నగర్-13111, మొత్తం 51290 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారన్నారు.సూర్యాపేటలో 31,కోదాడలో 22, హుజూర్ నగర్ లో 18 కలిపి జిల్లాలో మొత్తం 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.







