ది గోట్ లైఫ్(ఆడు జీవితం): అతనిది ఎడారి నరకమే, కానీ ఆమెది అంతకుమించి?

ఇప్పుడంటే తెలుగు సినిమాలు కొందరు దర్శకుల వలన ఎల్లలు దాటాయి గానీ, మొన్నటి వరకూ రొడ్డకొట్టుడు సినిమాలే ఇక్కడ ఎక్కువ తాండవించేవి.అవును… సూపర్ స్టార్ ఇమేజీ బిల్డప్పులు, రొటీన్ ప్రజెంటేషన్లు తప్ప ఇంకేవీ ఇక్కడ కనబడేవి కావు.అయితే ఓటీటీలు వచ్చాక ఇక్కడ పెనుమార్పులే సంభవించాయి.మరీ ముఖ్యంగా మలయాళం సినిమాలు( Malayalam Movies ) సినిమా ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి.తెలుగు వెర్షన్లు, సబ్ టైటిళ్లతో భాషా సమస్య కూడా ఉండడంలేదు మరి.సినిమాల మాదిరి రివ్యూల కూడా అంతే.తెలుగులో రివ్యూలు అనేవి ఒకే ఒక ఫార్మాట్‌లో ఉంటాయి.డిఫరెంట్ యాంగిల్స్, లోతైన విశ్లేషణ మనదగ్గర తక్కువ.అయితే మలయాళంలో రివ్యూలు కూడా భిన్నంగా వుంటాయని మీకు తెలుసా?

 Facts About The Goat Life Heroine Amala Paul Details, Aadujeevitham Movie, Aaduj-TeluguStop.com
Telugu Aadujeevitham, Amala Paul, Malayalam, Nazeeb, Saudi Arabia, Goat-Movie

అసలు విషయంలోకి వెళితే ది గోట్ లైఫ్(ఆడు జీవితం)( Aadujeevitham ) సినిమా విషయానికొస్తే ఇక్కడ ఎటువంటి ఆదరణ వుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యి చాలామంది ప్రశంసలు పొందుతోంది.పాన్ ఇండియా సినిమాగా ఐదారు భాషల్లో రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల సంగతి ఎలాగున్నా, క్రిటిక్స్ అయితే ఈ సినిమాని ఆకాశానికెత్తేస్తున్నారు.అయితే ఇక్కడే రివ్యూలు కాస్త తేడా కొడుతున్నాయి.

ఒక్క రివ్యూ ఏమిటి… ఒరిజినల్ పుస్తకంలో గానీ, సినిమాలోగానీ కథానాయకుడు ఎదుర్కొన్న ఎడారి నరకం, అనుభవించిన మనోవ్యథ గురించి తప్పితే అతని భార్య సాధకబాధలను ఎక్కడా సరిగా పోట్రె చేయలేదనే చెప్పుకోవాలి.ఈ పాత్రను అమలాపాల్( Amala Paul ) పోషించింది.

సినిమా ఫస్టాఫ్‌లో ఆ పాత్ర ఇంపార్టెన్స్ పుస్తకంతో పోలిస్తే పెంచినట్టు అనిపించినా సరే, సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి పెద్దగా చూపించలేదు.

Telugu Aadujeevitham, Amala Paul, Malayalam, Nazeeb, Saudi Arabia, Goat-Movie

90వ దశకం ప్రారంభంలో నజీబ్( Nazeeb ) సంపాదన కోసం సౌదీ అరేబియాకు వెళ్తాడు.ఆ సమయానికి సైను 8 నెలల గర్భిణిగా ఉంటుంది.తను వెళ్లిన మరుక్షణం నుంచీ తిరిగి నజీబ్ బతికే ఉన్నాడనే వార్త తెలిసేవరకూ ఆమె ఎటువంటి బాధను అనుభవించిందో నవల గానీ, పుస్తకం గానీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు.

ఎంతసేపూ అతని గురించే తప్ప ఆమె గురించి చెప్పింది తక్కువే.ఇపుడు ఇదే విషయాన్ని ఓ తమిళ సోషల్ మీడియా రివ్యూ చెబుతూ గట్టిగా ఏసుకుంది సదరు దర్శకనిర్మాతలకు.

అది ఖచ్చితంగా దర్శకుడి వైఫల్యమే అని చెప్పుకొచ్చింది.సినిమాలలో కూడా అలా అమ్మాయిల పట్ల పార్స్యాలిటీ వహిస్తే ఎలా అని ప్రశ్నించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube