నేర నియంత్రణకు అవసరమైన చర్యలు: రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి

జిల్లాలో నేర నియంత్రణ( Crime Control )కు అవసరమైన చర్యలు తీసుకుంటూ, వృద్ధులు,మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఎన్నికల విధుల్లో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సిపి తరుణ్ జోషి( Rachakonda Commissioner Tarun Joshi ) అన్నారు.మంగళవారం భువనగిరి జిల్లా( Bhuvanagiri ) కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో యాదాద్రి జోన్ డీసీపీ,అదనపు డీసీపీలు,ఏసిపిలు,ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

 Steps Needed To Control Crime Says Rachakonda Commissioner Tarun Joshi, Tarun Jo-TeluguStop.com

ఈసమావేశంలో యాదాద్రి జోన్ లోని వివిధ స్టేషన్లలో నమోదైన పోక్సో కేసులు,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు,పెండింగ్ గ్రేవ్ కేసుల విచారణ,ఇతర కేసుల విచారణ,పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఎన్నికల నిబంధనలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులకు, సిబ్బందికి ఉన్న పరిజ్ఞానాన్ని సమీక్షించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి జోన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచాలని,నేరనియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి బాధలను ఓపికగా విని తగిన న్యాయం చేయాలని సూచించారు.

రానున్న లోక్ సభ ఎన్నికలను( Loksabha Elections ) పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని,ఎన్నికల నిబంధనలకు సంబంధించి చట్టాలు,సెక్షన్ల మీద అధికారులు,సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు.ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని అధికారులకు సూచించారు.

ఈకార్యక్రమంలో యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర,అడిషనల్ డీసీపీలు,ఎసిపిలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube