రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( District Collector S Venkatrao ) అన్నారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా( Suryapet ) చివ్వేంల మండలం కుడకుడలో మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్,కందగట్లలో పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళారుల నుండి మోసపోకుండా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
పీఏసీఎస్( PCS ) ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో టెంట్,త్రాగునీరు వసతి లేకపోవడంతో నిర్వాహకులు,సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు.రైతులు( Farmers ) తెచ్చే ధాన్యంలో తేమ శాతం 17 మించకుండా ఉండాలని, అలాగే ధాన్యం శుద్ధి చేసే యంత్రం ద్వారా శుభ్రపరచాలన్నారు.
అన్ని కేంద్రాల్లో గన్ని సంచులు, తేమ శాతం మిషన్లు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు,టార్పాలిన్లు, కూలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు.కేంద్రాల్లో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాని నిలువ ఉంచకుండా వెంటనే ట్యాగింగ్ చేసిన ఆయా మిల్లులకు తరలించాలన్నారు.వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అనుబంధ శాఖ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ముఖ్యంగా మండల ప్రత్యేక అధికారులు,తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్,పిఏసిఎస్ సిబ్బంది,నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.