సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే మోహన్ బాబు హీరోగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో చాలా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.
ఇక హీరోగా ఫేడ్ ఔట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన కొడుకులు అయిన విష్ణు మనోజ్ కూడా హీరోలుగా మారి తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే విష్ణు( Manchu Vishnu ) భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా( Kannappa Movie )ను రూపొందిస్తూ ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో శివుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక దాంతో పాటుగా ప్రభాస్ కి సంబంధించిన షూట్ కూడా తొందర్లోనే ఫినిష్ చేసి ప్రభాస్ ఫస్ట్ లుక్( Prabhas First Look ) ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో విష్ణు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక దీనికోసం ప్రభాస్ పది రోజుల డేట్స్ ని కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ శివుడి( Lord Shiva ) గానే కాకుండా ఒక ఐదు నిమిషాల పాటు నార్మల్ మనిషి లాగా కూడా కనిపించెబుతున్నాడట…
ఇక దానికి సంభందించిన సీన్స్ ను కూడా తెరకెక్కించే ప్రయత్నం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది… అంట ఇక అందులో భాగంగానే ప్రభాస్( Prabhas ) కి ఒక ఫైట్ కూడా ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక దేవుడు మనిషి రూపంలో వస్తాడా లేదంటే ఈ పాత్ర కోసం మరో ప్రభాస్ ని దించబోతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక భారీ ఫైట్ ను కూడా చేయించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ దెబ్బతో సినిమా మీద భారీ లెవెల్లో అంచనాలు పెరుగుతాయనే చెప్పాలి…
.