వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి ( Venu Swamy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వేణు స్వామి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ కూడా వార్తలలో నిలుస్తూ ఉన్నారు.
ఇలా ఈయన ఇటీవల కాలంలో ప్రభాస్( Prabhas ) జాతకం గురించి చెబుతూ పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ విషయంలో అభిమానులు వేణు స్వామి పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇలా జ్యోతిష్యం చెబుతూ ఎంతో బిజీగా ఉండే వేణు స్వామి ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఇక ఈయన భార్య వీణా వాణి ( Veena Vani )గురించి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.ఈమె గొప్ప వీణవాయిద్యకారురాలు.అయితే వీణ వాణి కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తుంటారు తాజాగా ఈమె తన భర్తతో కలిసి ఒక రీల్ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా వీరిద్దరూ ప్రభాస్ మిర్చి ( Mirchi )సినిమాలోని ఒక సన్నివేశాన్ని రీల్ వీడియోగా చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్ తో మాట్లాడుతూ ఎలాంటి అమ్మాయి కావాలేంటీ అంటూ తనకు కాబోయే అమ్మాయి గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది.ఆ సన్నివేశాన్ని వీరిద్దరూ రీల్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా మీ ఇంట్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ ని పెట్టుకొని ఇలా ప్రభాస్ గురించి తప్పుడు జాతకాలు చెబుతున్నారంటూ మరోసారీ ఈయన చేసినటువంటి రీల్ వీడియో పై ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.