ఏపీలో అలా జరిగితే పవన్ అదృష్టవంతుడే.. ఆయనకు మాత్రం తిరుగులేదంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రోజుకో మలుపు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రధానంగా పలు నియోజకవర్గాల్లో ఏ పార్టీది గెలుపో తెలియాల్సి ఉంది.

 Pawan Kalyan Is Luckiest Person Details Here Goes Viral In Social Media , Tdp,-TeluguStop.com

టీడీపీ ,వైసీపీలలో ( TDP, YCP ) ఏ పార్టీ విజయం సాధించినా మెజారిటీ 10, 15 సీట్ల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.టీడీపీ 144 స్థానాలలో పోటీ చేస్తుండగా 88 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది.

అయితే జనసేన ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కూటమి విజయం సాధించి అధికారంలోకి రావాలంటే జనసేన ( Janasena )స్థానాలు ఎంతో కీలకం కాగా జనసేనకు 12 నుంచి 14 స్థానాలలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

బీజేపీ( BJP ) మాత్రం ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కూడా 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి.

ఒకటి రెండు సర్వేలు మాత్రం పవన్ ఓడిపోవచ్చని చెబుతున్నాయి.

Telugu Jagan, Janasena, Luckiest Person, Pawan Kalyan, Pawankalyan, Surveys-Poli

వైసీపీకే 90 కంటే ఎక్కువ స్థానాలు వస్తే మాత్రం ఏమీ చేయలేము.రాబోయే నెలరోజులు అన్ని పార్టీలకు కీలకమైన నేపథ్యంలో మరింత ప్రభావం చూపేలా వైసీపీ, టీడీపీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఏ మాత్రం వాడి వేడి తగ్గించినా ఆయా పార్టీల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

జనసేన కింగ్ మేకర్ అయితే పవన్ కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.

Telugu Jagan, Janasena, Luckiest Person, Pawan Kalyan, Pawankalyan, Surveys-Poli

ఎన్నికల సర్వేల ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.అటు చంద్రబాబు ఇటు జగన్( jagan ) లలో గెలుపు గురించి నమ్మకం బాగానే కనిపిస్తోంది.ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో వేగం పెంచారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు కూడా జోరుగా జరుగుతున్నాయని తెలుస్తోంది.పవన్ మాత్రం ఈ ఎన్నికలతో జనసేన ప్రస్థానం మొదలవుతుందని ఫీలవుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube