ఏపీలో అలా జరిగితే పవన్ అదృష్టవంతుడే.. ఆయనకు మాత్రం తిరుగులేదంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రోజుకో మలుపు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ప్రధానంగా పలు నియోజకవర్గాల్లో ఏ పార్టీది గెలుపో తెలియాల్సి ఉంది.టీడీపీ ,వైసీపీలలో ( TDP, YCP ) ఏ పార్టీ విజయం సాధించినా మెజారిటీ 10, 15 సీట్ల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చని తెలుస్తోంది.

టీడీపీ 144 స్థానాలలో పోటీ చేస్తుండగా 88 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది.

అయితే జనసేన ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కూటమి విజయం సాధించి అధికారంలోకి రావాలంటే జనసేన ( Janasena )స్థానాలు ఎంతో కీలకం కాగా జనసేనకు 12 నుంచి 14 స్థానాలలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

బీజేపీ( BJP ) మాత్రం ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కూడా 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి.ఒకటి రెండు సర్వేలు మాత్రం పవన్ ఓడిపోవచ్చని చెబుతున్నాయి.

"""/" / వైసీపీకే 90 కంటే ఎక్కువ స్థానాలు వస్తే మాత్రం ఏమీ చేయలేము.

రాబోయే నెలరోజులు అన్ని పార్టీలకు కీలకమైన నేపథ్యంలో మరింత ప్రభావం చూపేలా వైసీపీ, టీడీపీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

ఏ మాత్రం వాడి వేడి తగ్గించినా ఆయా పార్టీల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

జనసేన కింగ్ మేకర్ అయితే పవన్ కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.

"""/" / ఎన్నికల సర్వేల ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.అటు చంద్రబాబు ఇటు జగన్( Jagan ) లలో గెలుపు గురించి నమ్మకం బాగానే కనిపిస్తోంది.

ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో వేగం పెంచారు.ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు కూడా జోరుగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

పవన్ మాత్రం ఈ ఎన్నికలతో జనసేన ప్రస్థానం మొదలవుతుందని ఫీలవుతున్నారని తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్23, ఆదివారం 2024