ఐపీఎల్ 17 సీజన్( IPL 17 Season ) లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది.ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు తను ఆడిన రెండు మ్యాచ్ ల్లో చాలా చెత్త ప్రదర్శన ఇచ్చి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే వాళ్లు ఆడిన రెండు మ్యాచ్ ల్లో మంచి విజయం సాధించి మంచి ఫామ్ లో ఉన్నారు.ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ బ్యాట్ తో, అలాగే బుమ్రా బాల్ తో రాణిస్తే ఈ మ్యాచ్ ను ముంబై గెలిచే అవకాశం ఉంటుంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో కెప్టెన్ అయిన సంజు శాంసన్, రియాన్ పరాగ్ ( Sanju Samson )లు బీభత్సమైన ప్రదర్శనను ఇస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు.ఇక ఈ టీంలో బట్లర్,జైశ్వాల్ సరిగ్గా ఆడకపోయినప్పటికీ వీళ్లు రెండు మ్యాచ్ లను అలవోకదా గెలిచారు.ఒకవేళ ఈ మ్యాచ్ లో బట్లర్ , జశ్వాల్ టచ్ లోకి వస్తే ఈ మ్యాచ్ చాలా రసవతారంగా మారుతుంది.రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల లో ఆవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్లను పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నాడు.
ఇక ఇప్పటివరకు ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం యావరేజ్ స్కోర్ 169 గా ఉంది, ఇక సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం యావరేజ్ స్కోర్ 159 గా ఉంది.ఇక ఇప్పటివరకు ఈ రెండు టీములు హెడ్ టు హెడ్ 29 మ్యాచ్ లు ఆడితే ముంబై 16, రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ ల్లో నెగ్గాయి.
ఇక ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో 111 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50 మ్యాచ్ ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 61 మ్యాచ్ లో నెగ్గాయి.డ్యూ ఫ్యాక్టర్ కారణంగా ఈ పిచ్ స్పిన్నర్ల కంటే పేస్ బౌలర్లకి ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది.డ్యూ ఫ్యాక్టర్ ఉండడంతో చేజింగ్ చేసిన టీం కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కావున టాస్ కీలకంగా మారనుంది.టాస్ గెలిచిన టీం మొదటగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.చూడాలి మరి ఈ మ్యాచ్ లో అయిన ముంబై ఇండియన్స్ గెలిచి తమ పరువు ను కాపాడుకొని ఈ ఐపిఎల్ సీజన్ లో బోణీ కొడుతుందేమో చూడాలి…ఇక ఈ రెండు టీమ్ ల్లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతమున్న ఫామ్ లో గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…
.