వేసవి కాలం( Summer ) ప్రారంభం అయింది.రోజురోజుకు భానుడి భగభగలు భారీగా పెరుగుతున్నాయి.
అయితే ఈ వేసవి కాలంలో చాలా మందిని కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో డార్క్ అండర్ ఆర్మ్స్( Dark Underarms ) ఒకటి.అండర్ ఆర్మ్స్ విషయంలో కొందరు చాలా కేర్ తీసుకుంటారు.
అయితే ఎంత కేర్ తీసుకున్న కూడా ఈ వేసవిలో అధిక వేడి, చెమట కారణంగా నల్లగా అసహ్యంగా మారుతుంటాయి.దీంతో ఏం చేయాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.
కానీ వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే చాలా సులభంగా డార్క్ అండర్ ఆర్మ్స్ కు బై బై చెప్పవచ్చు.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోవాలి, అలాగే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, ఇలా రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల సహజంగానే డార్క్ అండర్ ఆర్మ్స్ వైట్ గా మరియు స్మూత్ గా మారతాయి.అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్( Potato Juice ) మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ ను దూది సాయంతో అండర్ అర్మ్స్ లో అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల నలుపు క్రమంగా పోతుంది.
అండర్ ఆర్మ్స్ తెల్లగా మారుతాయి.
అండర్ ఆర్మ్స్ తెల్లగా మారడానికి మరో అద్భుతమైన రెమెడీ కూడా ఉంది.దానికోసం వన్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric )లో రెండు మూడు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని అండర్ అర్మ్స్ లో అప్లై చేసి డ్రై అయ్యాక కడిగేయాలి.
ఇలా చేయడం వల్ల కూడా డార్క్ అండర్ ఆర్మ్స్ కు బై బై చెప్పవచ్చు.ఇక ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వడం తో పాటు అండర్ ఆర్మ్స్ లో హెయిర్ ను ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి.
అలాగే రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు అండర్ ఆర్మ్స్ స్వెట్ ప్యాడ్స్ ను ఉపయోగించాలి.ఇవి చెమటను పీల్చుకుని అండర్ ఆర్మ్స్ ను పొడిగా ఉంచుతాయి.దుర్వాసన రాకుండా అడ్డుకుంటాయి.