చాలామంది దర్శకులకు ఒక ప్రాబ్లం ఉంటే మన బోయపాటికీ( Boyapati ) మాత్రం మరొక రకమైన ప్రాబ్లం ఎదురవుతోంది.సినిమా తీయడానికి కథ రెడీ.
ఆ కథకు ఖర్చు పెట్టడానికి నిర్మాత రెడీ.సినిమా చేయాల్సిన బోయపాటి కూడా డైరెక్టర్ గా రెడీ గానే ఉన్నాడు.
కానీ అసలైన హీరో మాత్రం దొరకలేదు.స్కంద సినిమా( Skanda movie ) చూసిన తర్వాత బోయపాటి తదుపరి సినిమా కోసం హీరో దొరకడం లేదట.
ఇలా అని ఉన్న అల్లుడి నోట్లో శని లాగా డబ్బులు పెట్టే నిర్మాత రెడీగా ఉన్నా తీయడానికి హీరోగా రెడీగా లేకపోవడం బోయపాటికి ప్రస్తుతం పెద్ద టాస్క్ అయిపోయింది.మరి నిజానికి బోయపాటి ఎవరితో సినిమా తీయాలి అనుకున్నాడు ? తన తదుపరి సినిమా హీరో ఎవరు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్కంద లాంటి ప్లాప్ పడ్డ తర్వాత ఏ దర్శకుడు కైనా కూడా మరొక నిర్మాత దొరకడం కష్టం.కానీ బోయపాటికి చిటిక వేసినంత ఈజీగా అల్లు అరవింద్( Allu Arvind ) తో కథ చెప్పించి మరి ఒప్పించేసాడు.గీతా ఆర్ట్స్ ( Geeta Arts ) లో సినిమా కన్ఫామ్ చేశాడు.నిజానికి అల్లు అరవింద్ ఒప్పించడం అంత ఈజీ టాస్క్ ఏమి కాదు.కానీ బోయపాటి చాలా సులువుగా ఈ పని చేసేసారు.అయితే ఒకసారి గీత ఆర్ట్స్ లో సినిమా అనగానే అందరూ కూడా అల్లు అర్జున్ తో బోయపాటి తదుపరి సినిమా తీయబోతున్నాడు అని అనుకున్నారు.
కానీ అల్లు అర్జున్ తో సినిమా తీయాలి అంటే దాదాపు బోయపాటి మూడేళ్లకు పైగా ఎదురు చూడాల్సి ఉంటుంది.
ఇప్పటికే పుష్ప 2 సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతుండగా పుష్ప 3 కూడా ఉండబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.ఇవి కాక త్రివిక్రమ్, అట్లీ ( Trivikram, Atlee )ఇప్పటికే లైన్ లో వెయిట్ చేస్తున్నారు.మరి వారిని కాదని అల్లు అర్జున్ డేట్స్ కోసం బోయపాటి ఎదురు చూసే పరిస్థితి లేదు.
ఇక అతని ఆస్థాన హీరో అయిన బాలకృష్ణ తీద్దామా అంటే బాలకృష్ణ కూడా తన చిన్న కూతురు బ్యానర్ లో అఖండ 2 తీయడానికి సిద్ధం అయిపోతున్నారు.అది కాకుండా బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఆ తర్వాత హరీష్ శంకర్ ని కూడా లైన్లో పెట్టేసాడు.అందుకే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ రావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ కనిపిస్తుంది.
దాంతో ఇక మార్చాల్సింది హీరో కాదు బ్యానర్ అనే కన్ఫర్మ్ అయిపోయాడు బోయపాటి.