టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో టాలెంట్ తో అభిమానులకు దగ్గరవుతున్న హీరో ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )పేరు సమాధానంగా వినిపిస్తుంది.జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వరుస హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
తారక్ కు ఉన్న సక్సెస్ రేట్ ఈ మధ్య కాలంలో మరే హీరోకు లేదని చెప్పవచ్చు.వరుసగా ఆరు విజయాలు సాధించడం ఎంతో కష్టం కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలవోకగా ఆరు విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
పెళ్లి తర్వాత కొన్ని విషయాలలో జూనియర్ ఎన్టీఆర్ మారారు.ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.భార్య లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) అంటే తారక్ కు ఎంతో ప్రేమ కాగా ఆమెను ముద్దుగా ఎన్టీఆర్ అమ్ములు అని పిలుస్తారట.ప్రణతి నిక్ నేమ్ అమ్ములు( Ammulu ) అని తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ నిక్ నేమ్ కూడా బాగానే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జోడీ కూడా ఇండస్ట్రీలోని బెస్ట్ జోడీలలో ఒకటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.లక్ష్మీ ప్రణతి చాలా టాలెంటెడ్ అని అయితే సోషల్ మీడియాను వినియోగించడం ఆమెకు ఎక్కువగా ఇష్టం ఉండదని తెలుస్తోంది.ఎన్టీఆర్ కు సినిమాల విషయంలో సైతం లక్ష్మీ ప్రణతి ఎంతో సహాయం చేస్తారని తెలుస్తోంది.

లక్ష్మీ ప్రణతి ఇచ్చిన సలహాలు ఇచ్చిన సలహాలు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు ఎంతో ఉపయోగపడ్డాయని భోగట్టా.ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జోడీ చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు.తారక్ స్క్రిప్ట్ సెలక్షన్ అద్భుతంగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.భవిష్యత్తులో తారక్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







