యువన్ థక్కర్( Yuvan Thakkar ) క్యాన్సర్‌తో బాధపడుతున్న భారత సంతతికి చెందిన యువకుడు యూకే ప్రభుత్వ నిధులతో నేషనల్ హెల్త్ సర్వీస్( National Health Service ) ఏర్పాటు చేసిన నిధికి ధన్యవాదాలు తెలిపారు.వేలాదిమందికి వినూత్న చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చి .
జీవితాలను నిలబెడుతోందని యువన్ పేర్కొన్నారు.ఎన్‌హెచ్ఎస్ ఇంగ్లాండ్ ప్రకారం.
లండన్ సమీపంలోని వాట్‌ఫోర్డ్‌కు చెందిన 16 ఏళ్ల ఠక్కర్ ‘‘ ఎన్‌హెచ్ఎస్ డ్రగ్స్ ఫండ్ (సీడీఎఫ్ ) ’’కి కృతజ్ఞతలు తెలిపాడు .‘ tisagenlecleucel (Kymriah) ’ అని పిలవబడే ‘‘ CART ’’ థెరపీ నుంచి ప్రయోజనం పొందిన యూకేలో తొలి బిడ్డగా రికార్డుల్లోకెక్కాడు.

జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్ఎస్) ఈ వారాంతంలో 1,00,000 మంది రోగులు సీడీఎఫ్ సహాయంతో సరికొత్త , అత్యంత వినూత్యమైన చికిత్సలకు ముందస్తు యాక్సెస్‌ను పొందడం ద్వారా ఒక మైలురాయిని అధిగమించింది.తాను CART థెరపీని( CART therapy ) స్వీకరించినప్పటి నుంచి తన జీవితం చాలా మారిపోయిందని థక్కర్ పేర్కొన్నాడు.తాను అందుకున్న అద్భుతమైన సంరక్షణ కోసం లండన్‌లోని గ్రేట్ ఒర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ (జీవోఎస్‌హెచ్)కి ధన్యవాదాలు తెలిపాడు.తాను ఆసుపత్రికి పలుమార్లు వెళ్లాల్సి వచ్చిందని.అనారోగ్యం కారణంగా పాఠశాలకు దూరంగా వుండాల్సి వచ్చిందని యువన్ ఆవేదన వ్యక్తం చేశారు.స్నూకర్ ఆడటం, స్నేహితులను కలవడం వంటి నేను ఇష్టపడే పనులను కూడా ఆస్వాదించలేకపోయానని గుర్తుచేసుకున్నారు.
చికిత్స అందుబాటులో లేకుంటే పరిస్ధితి ఎలా వుంటుందో ఊహించడం కష్టమని యువన్ పేర్కొన్నాడు.

థక్కర్.ఆరేళ్ల వయసులో ఒక రకమైన లుకేమియా బారినపడ్డాడు.క్యాన్సర్ కణాలను( Cancer cells ) గుర్తించి దాడి చేయడానికి వ్యక్తి రోగ నిరోధక కణాలను సవరించే చికిత్సను అతను పొందాడు.
కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్( Chemotherapy, bone marrow transplant ) వంటి ఇతర చికిత్సలను పొందిన అనంతరం 2019లో సీడీఎఫ్ నుంచి ట్రీట్‌మెంట్ ప్రారంభమైంది.మా ప్రార్థనలు ఫలించి, తమ బిడ్డకు రెండవ అవకాశం వచ్చిందని .ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణంలో మాకు సహాయం చేసిన వైద్యులు , నర్సులందరికీ థక్కర్ తల్లి.సప్నా థక్కర్ కృతజ్ఞతలు తెలిపారు.
జూలై 2016లో ప్రారంభమైన సీడీఎఫ్.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (ఎన్‌ఐసీఈ) చే ఆమోదించబడిన క్యాన్సర్ చికిత్సలకు ఫాస్ట్ ట్రాక్ యాక్సెస్‌ని అందించడానికి ఎన్‌హెచ్‌ఎస్ అనుమతించింది.
దీని ప్రకారం రోగుల జీవితాలను రక్షించడానికి 100కు పైగా ఔషధాలను వేగంగా యాక్సెస్ చేయడానికి ఆసుపత్రులను అనుమతిస్తుంది.







