Zomato Delivery Boy : వైరల్ పోస్ట్: మరి కొద్ది రోజుల్లో చెల్లెలి పెళ్లి.. తన ఐడి ని బ్లాక్ చేసిన జొమటో.. రోడ్డుపై ఏడుస్తూ..?!

కొన్ని సందర్భాలలో ప్రముఖ డెలివరీ యాప్ జొమాటో( Zomato ) తన కంపెనీ బాయ్స్ అకౌంట్ లను అప్పుడప్పుడు బ్లాక్ చేస్తుంటుంది.అలా అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా డెలివరీ బాయ్స్ కి ఆర్డర్స్ రావు.

 Delhi Delivery Worker In Tears As Zomato Blocks His Account Ahead Of Sister Wed-TeluguStop.com

దాంతో సదరు డెలివరీ బాయ్( Delivery Boy ) ప్రత్యామ్నాయంగా మరో ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.సంస్థ ఒక్కసారి ఐడి బ్లాక్ చేసిందంటే దాదాపుగా ఆ ఐడి యాక్టివ్ కాదు.

ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది.ఇందులో భాగంగా డెలివరీ బాయ్ నడి రోడ్డుపై ఏడుస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సదరు డెలివరీ బాయ్ జొమోటో లో డెలివరీ బాయ్( Zomato Delivery Boy ) గా పనిచేస్తున్నాడు.ఆ సంస్థ తన ఐడి బ్లాక్ చేసిందని.త్వరలో తన పెళ్లి ఉందని అతను తెలిపాడు.తన చెల్లి పెళ్లి కోసం డబ్బులు సంపాదించే ఒకే ఒక ఆధారమైన డెలివరీ బాయ్ గా తన ఐడి ను బ్లాక్( Zomato ID Block ) చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఢిల్లీలోని జీటీవీ నగర్ రోడ్డుపై ఏడుస్తూ ఉండడం ఓ వ్యక్తి చూశాడు.

ఆ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో జరిగిన విషయాన్ని వివరిస్తూ పోస్ట్ చేయగా అతనికి మద్దతుగా అనేక నెటిజెన్స్ నిలబడుతున్నారు.


అందులో భాగంగానే అనేకమంది ట్విట్టర్ వేదికగా( Twitter ) జోమాటో సంస్థను ట్యాగ్ చేస్తూ అతని ఐడి యాక్టివేట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.ఇక అలాగే తన చెల్లికి పెళ్లి( Sister Marriage ) చేయాలన్న అన్న ఆలోచనకు సదరు డెలివరీ బాయ్ బ్యాంక్ అకౌంట్ ను పోస్ట్ చేశారు.దాంతో ట్విట్టర్ లో ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో అతనికి ఆర్థిక సాయం చేయడానికి అనేకమంది ముందుకు వచ్చారు.

ఈ పోస్టుకు జోమాటో సంస్థ కూడా స్పందిస్తూ.అతని ఐడిని అతి త్వరలో యాక్టివేట్ చేస్తామని హామీ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube