IPL Cricket Balls : ఐపీఎల్ లో వాడే క్రికెట్ బాల్స్ ఎక్కడ ఎలా తయారవుతాయో తెలుసా..?!

ప్రస్తుతం ఐపీఎల్( IPL ) భారతదేశ క్రికెట్ అభిమానులను ఉర్రూతలుగిస్తుంది.ప్రతిరోజు రాత్రి అవ్వగానే క్రికెట్ అభిమానులు టీవీ ముందరికి చేరిపోతున్నారు.

 Ipl Balls Making Meerut In Uttar Pradesh Ruling Cricket Balls Market-TeluguStop.com

కొందరు పనిలో ఉన్న కానీ మొబైల్ లో స్ట్రీమింగ్ కావడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు చూస్తున్నారు.ఇక ఇలా ఉంటే అసలు ఐపిఎల్ మ్యాచ్ లలో వాడే క్రికెట్ బాల్స్( Cricket Balls ) ఎక్కడ తయారవుతాయి ఎప్పుడైనా ఆలోచించారా.? కేవలం ఐపిఎల్ లో ఆడే బాల్స్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా వాడే బాల్స్ తయారీ ఎక్కడ జరుగుతుంది ఎప్పుడైనా తెలుసుకుందామని అనుకున్నారా.

Telugu Balls, Bcci, Cricket Balls, Ipl Balls, Latest, Meerut, Meerutcricket, Tea

ఇక అసలు విషయంలోకి వెళితే.భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్ననగరం మీరట్.( Meerut ) కాకపోతే ఈ సిటీ క్రికెట్ బాల్స్ మేకింగ్ కు ఎంతో పేరుగాంచింది.

భారత్ లో జరిగే ఏ క్రికెట్ మ్యాచ్ టోర్నీలో అయినా సరే వాడే బాల్స్ తయారయ్యేది ఈ నగరం నుండే.ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో వాడుతున్న వైట్ బాల్స్( White Balls ) కూడా ఇక్కడి నుంచి వచ్చినవి.

అంతర్జాతీయ క్రికెట్ లో వాడే రెడ్, పింక్, వైట్ బాల్స్ ని కూడా మీరట్ లోనే తయారవుతాయి.ప్రతి సంవత్సరం కేవలం బాల్స్ మేకింగ్ తో 500 కోట్ల బిజినెస్ జరుగుతుందంటే మీరు నమ్మగలరా.? ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక మిషన్లతో చాలా చోట్ల క్రికెట్ బాల్స్ ను తయారు చేస్తారు.కాకపోతే మీరెట్ లో తయారయ్యే స్పోర్ట్స్ సామాగ్రికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.

Telugu Balls, Bcci, Cricket Balls, Ipl Balls, Latest, Meerut, Meerutcricket, Tea

ముఖ్యంగా బిసిసిఐ, ఐసీసీ కూడా అధికారికంగా భారత్ లో తయారు చేసే క్రికెట్ బాల్స్ కు ఆమోదాన్ని తెలిపాయి.అందుకే క్రికెట్ మొదలైనప్పుడు నుంచి భారత్ లో ఎస్జి బాల్స్ వాడుతున్నారు.అలాగే ఇంగ్లాండ్ లో అయితే డ్యూక్ బాల్స్, ఆస్ట్రేలియాలో కూకాబుర్ర బాల్స్ వాడుతారు.ఇక ఈ బాల్ ఒక్కొక్క దాని ధర 12 వేల వరకు ఉంటుంది.

ఐపీఎల్ లో ప్రతి ఒక్క ఇన్నింగ్స్ కు రెండు బాల్స్ వాడుతారు.మ్యాచ్ మొత్తానికి నాలుగు బాల్స్ వాడుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube