Zomato Delivery Boy : వైరల్ పోస్ట్: మరి కొద్ది రోజుల్లో చెల్లెలి పెళ్లి.. తన ఐడి ని బ్లాక్ చేసిన జొమటో.. రోడ్డుపై ఏడుస్తూ..?!
TeluguStop.com
కొన్ని సందర్భాలలో ప్రముఖ డెలివరీ యాప్ జొమాటో( Zomato ) తన కంపెనీ బాయ్స్ అకౌంట్ లను అప్పుడప్పుడు బ్లాక్ చేస్తుంటుంది.
అలా అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా డెలివరీ బాయ్స్ కి ఆర్డర్స్ రావు.
దాంతో సదరు డెలివరీ బాయ్( Delivery Boy ) ప్రత్యామ్నాయంగా మరో ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ ఒక్కసారి ఐడి బ్లాక్ చేసిందంటే దాదాపుగా ఆ ఐడి యాక్టివ్ కాదు.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది.ఇందులో భాగంగా డెలివరీ బాయ్ నడి రోడ్డుపై ఏడుస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
"""/"/
సదరు డెలివరీ బాయ్ జొమోటో లో డెలివరీ బాయ్( Zomato Delivery Boy ) గా పనిచేస్తున్నాడు.
ఆ సంస్థ తన ఐడి బ్లాక్ చేసిందని.త్వరలో తన పెళ్లి ఉందని అతను తెలిపాడు.
తన చెల్లి పెళ్లి కోసం డబ్బులు సంపాదించే ఒకే ఒక ఆధారమైన డెలివరీ బాయ్ గా తన ఐడి ను బ్లాక్( Zomato ID Block ) చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఢిల్లీలోని జీటీవీ నగర్ రోడ్డుపై ఏడుస్తూ ఉండడం ఓ వ్యక్తి చూశాడు.
ఆ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో జరిగిన విషయాన్ని వివరిస్తూ పోస్ట్ చేయగా అతనికి మద్దతుగా అనేక నెటిజెన్స్ నిలబడుతున్నారు.
"""/"/
అందులో భాగంగానే అనేకమంది ట్విట్టర్ వేదికగా( Twitter ) జోమాటో సంస్థను ట్యాగ్ చేస్తూ అతని ఐడి యాక్టివేట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇక అలాగే తన చెల్లికి పెళ్లి( Sister Marriage ) చేయాలన్న అన్న ఆలోచనకు సదరు డెలివరీ బాయ్ బ్యాంక్ అకౌంట్ ను పోస్ట్ చేశారు.
దాంతో ట్విట్టర్ లో ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో అతనికి ఆర్థిక సాయం చేయడానికి అనేకమంది ముందుకు వచ్చారు.
ఈ పోస్టుకు జోమాటో సంస్థ కూడా స్పందిస్తూ.అతని ఐడిని అతి త్వరలో యాక్టివేట్ చేస్తామని హామీ ఇచ్చింది.
ఆన్లైన్లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ టెక్కి..