మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై( KTR ) క్రిమినల్ కేసు నమోదైంది.ఈ మేరకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ పై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు( Bathina Srinivas Rao ) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని కేటీఆర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే అసలు హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా దాన్ని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్( Banjara Hills Police Station ) ట్రాన్స్ ఫర్ చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు కేటీఆర్ పై ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.