Sidhu Jonnalagadda : సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ నట విశ్వరూపం.. చూడాల్సిన విషయాలు ఇవే !

“డీజే టిల్లు”( DJ Tillu ) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలోని డైలాగులు అద్భుతంగా ఉంటాయి.

 Dj Tillu Square Important Facts-TeluguStop.com

పాటలు, హీరో క్యారెక్టర్జేషన్, ఫన్నీ డైలాగ్ లు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, అన్నీ కూడా ఈ సినిమాని హిట్‌గా మార్చాయి.అందుకే దీనికి కొనసాగింపుగా “టిల్లు స్క్వేర్”( Tillu Square ) సినిమాని తీసుకొచ్చారు.

ఇది కూడా చాలా ఫన్నీగా ఉంది, ప్రేక్షకులను బాగా అలరించింది.ఈ సినిమా మొత్తాన్ని హీరో సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌( Sidhu Jonnalagadda ) తన భుజాలపై మోసాడు అని చెప్పుకోవచ్చు.

మూవీలోని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మొత్తం అతడే డామినెన్స్ చూపించాడు.ఇంకా సరిగా చెప్పాలంటే అతడు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

Telugu Mallik Ram, Dj Tillu, Dj Tillu Square, Djtillu, Tollywood-Telugu Top Post

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) నటించిన సంగతి తెలిసిందే.అయితే ఆమెతో సిద్దు కెమిస్ట్రీ పెద్దగా పండలేదు కానీ అతడి పర్ఫామెన్స్ మాత్రం థియేటర్లలో చాలామంది చేత చప్పట్లు కొట్టించింది.అనుపమ పెద్ద హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు ఇందులో మంచి వాల్యూ ఉన్న పాత్ర దొరకలేదు.నిజం చెప్పాలంటే సిద్దు పాత్ర మాత్రమే ఈ సినిమా మొత్తం లో హైలైట్ అయింది.

మొత్తం వెయిటేజీ అతడికే ఇచ్చాడు డైరెక్టర్ మల్లిక్ రామ్( Director Mallik Ram ).సిద్ధు కోసం రాసిన వన్ లైన్ పంచులు, ఫన్నీ డైలాగులు చాలా బాగా పేలాయి.ఈ హీరో వాటిని అద్భుతంగా చెప్పి థియేటర్‌లో నవ్వుల పోయించాడు, కేకలు పెట్టించాడు.ఇందులోని వన్ లైనర్లు చాలా హిలేరియస్ గా ఉన్నాయి.వీటిని బాగా ఆలోచించి రాసినట్లు ఉన్నారు.ఇలాంటి ఫన్నీయెస్ట్ వన్ లైనర్లు బహుశా రీసెంట్ టైమ్‌ లో ఏ సినిమాలో వచ్చి ఉండకపోవచ్చు.

Telugu Mallik Ram, Dj Tillu, Dj Tillu Square, Djtillu, Tollywood-Telugu Top Post

వాటిని బాగా డెలివరీ చేసిన సిద్ధుని ఎంత పొగిడినా తక్కువే.ప్రస్తుతం థియేటర్లలో మంచి సినిమాలు పెద్దగా ఏమీ లేవు కాబట్టి టిల్లు స్క్వేర్ బాగా కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.ఈ సినిమా కచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సిద్దు జొన్నలగడ్డ భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలను రావచ్చు.ఇలాంటి క్యారెక్టర్స్ మరిన్ని వస్తే అతడు నవీన్ పోలిశెట్టి రేంజ్ లో స్టార్డం తెచ్చుకోవచ్చు.

సిద్దు జొన్నలగడ్డ రూపంలో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరో మంచి నటుడు దొరికాడు అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube