ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించని వారు చాలా అరుదు.ప్రతి ఒక్కరూ దాదాపుగా స్మార్ట్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు.
ఇక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే అప్పుడప్పుడు సరదాగా ఫోటోలు దిగుతుంటారు.చాలామందికి ఫోటోలు దిగడం అంటే ఒక సరదా.అయితే ఫోన్ లో మరింత మెరుగైన ఫోటోలు తీయాలనుకుంటే, బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ యాక్ససరీస్ ల( Smartphone Photography Accessories ) గురించి తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ లెన్స్:

స్మార్ట్ ఫోన్ లో లెన్స్ కు( Lens ) బదులుగా ఫోటోలలో ఇంకాస్త వెరైటీ ఉండాలంటే క్లిప్-ఆన్ లెన్స్ ఉపయోగించవచ్చు.ఈ లెన్స్ ఉపయోగించడం వల్ల అధిక ఫోకలు పొడవు, జూమ్ సామర్థ్యం, ఫోకస్ చేసే దూరం, వైడ్ యాంగిల్ ఎఫెక్ట్, ఫిష్ ఐ ఎఫెక్ట్ ను అందిస్తాయి.ఫోటోగ్రఫీ ఇష్టం ఉండేవాళ్లు ఈ లెన్స్ ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫోటోలను తీసుకోవచ్చు.ఈ లెన్స్ ప్రారంభ ధర రూ.300 గా ఉంది.
మొబైల్ ట్రైపాడ్:

మీరు గనుక షట్టర్ ఫోటోలను తీయాలనుకుంటే ఈ మొబైల్ ట్రైపాడ్( Mobile Tripod ) చాలా ముఖ్యమైనది.ముఖ్యంగా రాత్రిపూట ఫోటోలు తీస్తున్నప్పుడు ఫోన్ స్థిరంగా ఉండడం చాలా ముఖ్యం.కాబట్టి ట్రైపాడ్ చాలా ఉపయోగపడుతుంది.అమెజాన్ లో ఈ ట్రైపాడ్ ధర రూ.300 గా ఉంది.
రిమోట్ షట్టర్ కంట్రోల్:

సెల్ఫీ ప్రియులు అద్భుతమైన ఫోటోలు తీసుకోవాలంటే.ఈ రిమోట్ షట్టర్ కంట్రోల్( Remote Shutter Control ) చాలా ముఖ్యం.కొంతమంది సెల్ఫీ ఫోటోల కోసం టైమర్ ఉపయోగిస్తున్నారు.
టైం వరకు బదులుగా రిమోట్ షట్టర్ కంట్రోల్ ఉపయోగించాలి.ఇది బ్లూటూత్ సపోర్ట్ తో రావడంతో పాటు ఆండ్రాయిడ్, iOS లకు అనుకూలంగా ఉంటాయి.
మొబైల్ గింబాల్:

ఫోన్లో వీడియోగ్రఫీ చేయాలంటే, అత్యంత కీలకం వీడియో స్థిరీకరణ. అందుకోసం మొబైల్ గింబార్ సహాయం తీసుకోవచ్చు.
పోర్టబుల్ LED ప్యానెల్:

చీకటిలో ఫోటోలు తీయాలంటే బ్రైట్ నెస్ తప్పనిసరి.ఆ బ్రైట్ నెస్ కోసం LED లైట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.చీకట్లో అద్భుతమైన ఫోటోలు తీసుకోవాలంటే, పోర్టబుల్ LED ప్యానెల్ కొనుగోలు చేయాల్సిందే.