Shankar , Rajinikanth : శంకర్ చెప్పిన రెండు అద్భుతమైన కథలను రిజెక్ట్ చేసిన రజినీకాంత్.. ఆ సినిమాలు ఏంటి..?

తెలుగులో రాజమౌళి ఏ విధంగా అయితే ఫ్లాప్స్ లేకుండా ఆ కెరియర్ ను కొనసాగిస్తున్నాడో ఒకప్పుడు శంకర్( Shankar ) కూడా అలాగే ఎలాంటి పరాజయం చవిచూడకుండా సినిమాలను తీస్తూ వచ్చాడు.ఆయన సినిమా తీస్తే ఒక సెన్సేషనల్.

 Why Rajinikanth Rejected Shankar Stories-TeluguStop.com

మొట్టమొదటగా జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడు శంకర్ తన కెరియర్ మొదలు పెట్టాడు.ఆ తర్వాత ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్ అంటూ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు శంకర్.

ఈ సినిమాల విజయాలతో తన ఇంటి ముందు ఎంతో మంది హీరోలు క్యూ కట్టే విధంగా పరిస్థితి మారిపోయింది.ఇక కథలో ఎంతో వైవిధ్యం ఉంటూనే బలంగా కూడా తయారు చేసేవారు శంకర్.

అయితే శంకర్ తయారు చేసిన రెండు అద్భుతమైన కథలను రజినీకాంత్( Rajinikanth ) రిజెక్ట్ చేశాడట.

Telugu Aparichitudu, Okkau, Rajinikanth, Shankar, Tollywood-Telugu Top Posts

ఆ రెండు కథలు ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.మొదటగా శంకర్ ఒకే ఒక్కడు సినిమా( Okkau movie ) కథను రజనీకాంత్ కి వివరించాడట.కానీ ఎందుకో రజినీకి ఆ కథ నచ్చలేదట.

దాంతో మరో కథ సిద్ధం చేసి తీసుకు రమ్మని చెప్పాడు.ఈ కథ అయితే తీయలేదని చెప్పాడట.

సరే అని ఆ రోజు ఊరుకున్నాడు.అదే సినిమా కథను యాక్షన్ కింగ్ అర్జున్ తో తీయగా అది బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక మరో మారు రజినీకాంత్ రిజెక్ట్ చేసిన శంకర్ కథ అపరిచితుడు( Aparichitudu ).ఈ సినిమాలో ముగ్గురి పాత్రలు మరియు వాటి స్వభావం రజనీకాంత్ కు ఏ మాత్రం రుచించలేదట.అసలు చేయనంటే చేయను మొహం మీద చెప్పేశాడట.

Telugu Aparichitudu, Okkau, Rajinikanth, Shankar, Tollywood-Telugu Top Posts

అయినా కూడా శంకర్ ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ఆ కథను విక్రమ్ కి చెప్పడంతో ఆయన చాలా ఎక్సైట్ అయిపోయి ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాడట.26 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో అన్నియన్ అనే పేరుతో విడుదల కాగా ఇదే చిత్రాన్ని తెలుగులో అపరిచితుడు పేరుతో డబ్బింగ్ చేశారు.అలాగే హిందీలో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అప్పటి వరకు శంకర్ కి బాయ్స్ మరియు నాయక్ సినిమాలో పరాజయాలు ఉన్నప్పటికి అపరిచితుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఫా శంకర్ పేరు నిల్చబెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube