స్టార్ హీరో రామ్ చరణ్( Ramcharan ) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లలో మగధీర ఒకటి కాగా బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఆరెంజ్( Orange ) ఒకటి.అప్పట్లోనే మగధీర 90 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఆరెంజ్ మూవీ మాత్రం నిర్మాత నాగబాబుకు( Producer Naga Babu ) భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.ఆరెంజ్ నష్టాల వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆయన చాలా సందర్భాల్లో వెల్లడించడం జరిగింది.
2009 సంవత్సరంలో మగధీర మూవీ( Magadheera movie ) థియేటర్లలో విడుదల కాగా 2010 సంవత్సరంలో ఆరెంజ్ మూవీ థియేటర్లలో విడుదలైంది.విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు రీరిలీజ్ కాగా మగధీర సినిమా రీరిలీజ్ లో డిజాస్టర్ గా నిలిస్తే ఆరెంజ్ మూవీ రీరిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఓడలు బండ్లు కావడం బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలకు రీరిలీజ్ లో వెరైటీ రెస్పాన్స్ రావడం ఫ్యాన్స్ ను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.మగధీర సినిమా చరణ్ పుట్టినరోజు కానుకగా నిన్న థియేటర్లలో విడుదలైంది.అయితే మగధీర సినిమాను ప్రేక్షకులు ఇప్పటికే చాలాసార్లు చూసిన నేపథ్యంలో ఈ సినిమా రీరిలీజ్ కు ఆశించిన రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది.గేమ్ ఛేంజర్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా విడుదలవుతుండటం గమనార్హం.అయితే ఈ తేదీ గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ సినిమా బడ్జెట్ గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.దిల్ రాజు స్పందిస్తే మాత్రమే ఈ సినిమా అసలు బడ్జెట్ గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.