మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు( Atchennaidu ) ఏపీ హైకోర్టులో( AP High Court ) ఊరట లభించింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో( Skill Development Scam Case ) అచ్చెన్నాయుడుపై ముందస్తు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడు ఏ38గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.
అయితే అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ సమయం కోరింది.దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 2కి వాయిదా వేసింది.