అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం అగ్రరాజ్యంలో తారాస్థాయికి చేరుకుంది.డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల తరపున జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌లు( Joe Biden ,Donald Trump ) నామినేషన్ సంపాదించారు.
దీంతో వీరిద్దరూ మరోసారి తుదిపోరుకు సిద్ధమవుతున్నారు.ఇదిలావుండగా.
సహజంగానే ఎన్నికల్లో పోటీ చేయడం ఏ దేశంలోనైనా ఖర్చుతో కూడుకున్న పని.తమ సొంత నిధులతో పాటు విరాళాల ద్వారా ఎన్నికల్లో పాల్గొంటారు నేతలు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ కోసం డెమొక్రాట్లు నిధుల సేకరణను వేగవంతం చేశారు.మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు( Bill Clinton , Barack Obama ) న్యూయార్క్‌లో సంయుక్తంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
తద్వారా రికార్డు స్థాయిలో 25 మిలియన్ డాలర్లను సేకరించారు.
ఇది బైడెన్‌కు కళ్లు చెదిరే మొత్తంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌తో పోటీపడుతున్నందున అధ్యక్షుడి ప్రచార నగదు శక్తిని పరీక్షిస్తారు.అయితే ట్రంప్ 2016లో డెమొక్రాట్ నేత హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టానికి ఎక్కువ డబ్బు సేకరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే నిరూపించారు.
రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో( Radio City Music Hall ) జరగనున్న ఫండ్ రైజింగ్ ఈవెంట్.మూడు దశాబ్థాలకు చెందిన డెమొక్రాటిక్ నాయకత్వాన్ని ఒక వేదికపైకి చేర్చింది.
దాతల దాతృత్వాన్ని బట్టి గంటల తరబడి జరిగే ఈ ఈవెంట్‌కు వివిధ స్థాయిల్లో యాక్సెస్ వుంటుంది.

జో బైడెన్, బరాక్ ఒబామా , బిల్ క్లింటన్‌లతో వేదికపై సంభాషణ, అర్ధరాత్రి టాక్ షో హోస్ట్ స్టీఫెన్ కోల్‌బర్ట్ వ్యాఖ్యానంతో జరగనుంది.క్వీన్ లతీఫా, లిజ్జో, బెన్ ప్లాట్, సింథియా ఎరివో, లీ మిచెల్ వంటి సంగీత ప్రదర్శనకారుల కాన్సర్ట్ వుంటుంది.దీనిని నటి మిండీ కాలింగ్ హోస్ట్ చేస్తారు.టికెట్ ధర వేలల్లో వుంటుందని అంచనా వేయగా.225 డాలర్లకే పరిమితం కావడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతలు అధ్యక్షులతో ఎక్కువ సేపు గడిపేందుకు అవకాశం కలుగుతుంది.

ముగ్గురు అధ్యక్షులు వున్న ఫోటో 1,00,000 డాలర్లు.2,50,000 డాలర్లు విరాళం ఇచ్చిన దాతలు రిసెప్షన్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు.5,00,000 డాలర్ల విరాళం ఇచ్చిన దాతలు ప్రత్యేక సమావేశంలో పాల్గొనడానికి అనుమతి దొరుకుతుంది.కానీ పార్టీ అక్కడితోనే ఆగిపోదు.బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ 500 మంది అతిథులతో రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో ఆఫ్టర్ పార్టీని నిర్వహిస్తున్నారు.







