తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటి, నిర్మాత, డ్యాన్సర్ ఫరాఖాన్( Farah Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో రంగాలలో రాణిస్తూ తనదైన మార్కుని క్రియేట్ చేసుకుంది.
ముఖ్యంగా నటిగా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫరాఖాన్.కాగా ఈమె 2004లో దర్శకుడు, ఎడిటర్ శిరీష్ కుందర్‌ను( Shirish Kunder ) పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత పిల్లల కోసం ఎంతగానో ప్రయత్నించి ఎన్నో కలలు కన్నారు.కానీ సహజంగా ఆ కల నెరవేరకపోవడంతో ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు.
ఐవీఎఫ్ ద్వారా 2008లో ముగ్గురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది.

తాజాగా అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంది ఫరాఖాన్.కాగా ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.నేను, శిరీష్ ఎప్పుడూ పిల్లల గురించే ఆలోచించేవాళ్లం.
వాళ్లు పుట్టాక ఏం పేర్లు పెట్టాలి? మన లైఫ్ ఎలా ఉండబోతుంది? అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం.ఐవీఎఫ్ ఫెర్టిలిటీ( IVF Fertility ) ట్రై చేసినప్పుడు డాక్టర్ నన్ను పిలిచి గర్భం దాల్చినట్లు చెప్పింది.
కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దంది.మేము షాకవుతూనే ఏమైందని అడిగాం.
ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడ్డాయని చెప్పింది.మేము ట్విన్స్ పుడతారేమోననుకున్నాం.
వాళ్లకు ఏ పేర్లు పెట్టాలా? అని తెగ ఆలోచించాం.ఓ రోజు శిరీష్.
ఒకవేళ గర్భంలో ముగ్గురుంటే.ఇంకో పేరు కూడా ఆలోచించాలి కదా అన్నాడు.అలా చిత్రవిచిత్ర పేర్లు పెట్టుకున్నాం.ఒకరోజు డాక్టర్ పిలిచి నీ కడుపులో ఉన్నది ఇద్దరు కాదు ముగ్గురు.నీకు 43 ఏళ్లు రాబోతున్నాయి.

ఈ వయసులో ముగ్గురిని మోయడం నీకంత మంచిది కాదు.డెలివరీ సమయంలో ఏదైనా ఇబ్బందులు రావొచ్చు.ఒక బేబీ చిన్నదిగా పుట్టే ఆస్కారం ఉంది, ఒకసారి ఆలోచించమని సూచించింది.
నేను బిడ్డను తీసేయడానికి ఒప్పుకోలేదు.కడుపులో ఉండే శిశువు రెండు కిలోలవరకు బరువుండాలని చెప్పింది.
పిల్లలు సరైన బరువుతో పుట్టేలా చూసుకుంటానని అన్నాను.నా పిల్లలు ఒక్కొక్కరు రెండున్నర కిలోల బరువుతో జన్మించారు.
అంటే ఏడున్నర కిలోలు నా పొట్టలో మోస్తూ తిరిగాను అని చెప్పుకొచ్చింది ఫరా ఖాన్.తన పిల్లలకు సిజర్, అన్య, దివ అనే పేర్లు పెట్టింది.
ఆ ముగ్గురూ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఈమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







