Viral Video : షాకింగ్ వీడియో: యువకుడు వద్దంటున్నా తల్లిదండ్రుల అండ చూసుకుని రెచ్చిపోయిన బాలిక..!

భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు హోలీ పండుగ( Holi Festival ) ఒకటి.అయితే పండుగ సందర్భంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను ఎంజాయ్ చేస్తారు.

 Video Of Girl Throwing Balloons At Mans Luggage On Holi-TeluguStop.com

అలా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఎవరైనా తమకు రంగులు పూయొద్దని అంటే వారికి జనాలు దూరంగానే ఉంటారు.కాకపోతే.

, తాజాగా హోలీ పండుగ పునస్కరించుకొని ఓ బాలిక పైశాచికతత్వంకి తన కుటుంబ సభ్యులు కూడా తోడవడంతో ఓ వ్యక్తి పడిన ఇబ్బంది సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సదరు బాలిక చేసిన వికృతి చేష్టలు సంబంధించి ఓ వ్యక్తి కెమెరాలో బంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే.అందులో ఉన్న బాధితుడి పేరు రోహన్ జైన్.తాను హోలీ పండుగ సందర్భంగా ఢిల్లీలో తన బంధువుల ఇంటికి వెళ్లగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

తన బంధువులు కలవడానికి కారులోంచి కిందకు దిగుతుండగా పై అంతస్తులో ఉన్న బాలిక నీటితో ఉన్న బెలూన్స్( Balloons ) ను విసరింది.తనపై బెలూన్లను విసరొద్దు అని చూపినా కూడా ఆ అమ్మాయి వినకుండా రెచ్చిపోయింది.

ఈ తతంగాన్ని మొత్తాన్ని బాల్కనీలో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులకు( Parents ) కూడా చూడడమే కాకుండా.ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడంతో వారి మధ్య కాస్త మాటల యుద్ధం జరిగింది.

ఆ అమ్మాయి చేస్తుంది తప్పని చెప్పిన కూడా వినకుండా.తన వద్ద లాప్టాప్ ఉందని.

, అది తడుస్తుందని మొత్తుకుంటున్న అమ్మాయి వినకుండా నీటి బెలూన్ విసురుతోనే ఉంది.దాంతో చిరాకు చెందిన వ్యక్తి అక్కడి పరిస్థితి వీడియో రూపంలో రికార్డు చేసి సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేశాడు.


ఈ వీడియోని చూసిన నెటిజన్స్ బాలికపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఇలా వేరే వారికి ఇబ్బంది పెట్టకూడదని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే అమ్మాయి విషయంలో తల్లిదండ్రులను తప్పు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube