Viral Video : ముంబై లోకల్ ట్రైన్‌లో సందడి చేసిన విదేశీ మహిళ.. వీడియో వైరల్‌..

ముంబై( Mumbai )కి వచ్చే చాలా మంది పర్యాటకులు అక్కడి లోకల్ రైళ్లను చూసి బాగా ఆశ్చర్యపోతుంటారు.ఎందుకంటే ప్రయాణికులు ఈ లోకల్ ట్రైన్ల( Local trains )ను ఎక్కి దిగే విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది.

 Foreign Woman Who Made Noise In Mumbai Local Train Video Viral-TeluguStop.com

భారతదేశంలోనే అత్యంత విస్తృతమైన, రద్దీగా ఉండే నెట్‌వర్క్‌లో ఇవి ఒకటి.రైళ్లు రోజూ నడుస్తూనే ఉంటాయి కానీ, పీక్ టైమ్ లో అవి చాలా రద్దీగా ఉంటాయి.

ప్రయాణికులు కొన్నిసార్లు ట్రైన్ డోర్ పక్కలకు వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తుంది.

విదేశీయులకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.ఎందుకంటే విదేశాల్లో ఏ ట్రైన్లు కూడా ఇంత రద్దీగా ఉండవు.ఇటీవల ఒక విదేశీ పర్యటకురాలు( Foreign woman) ముంబై లోకల్ ట్రైన్ ఎక్కింది.

తన అనుభవాన్ని ఒక వీడియో రూపంలో షేర్ చేసుకుంది.రైలు డోర్ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ప్రశాంతంగా బయటకు చూస్తున్న దృశ్యంతో వీడియో మొదలవుతుంది.

కానీ రైలు ఆగకముందే, భారీ జనం గుంపులు గుంపులుగా లోపలికి రావడంతో అక్కడ అస్తవ్యస్తంగా మారిపోతుంది.

ఈ వీడియో 5,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.స్థానిక జీవన విధానాన్ని స్వీకరించినందుకు పర్యాటకురాలిని చాలామంది ప్రశంసించారు.అలానే ఆమె సురక్షితంగా ప్రయాణించాలని ఆకాంక్షించారు.

ముంబై యొక్క లోకల్ రైళ్లు వాటి రద్దీకి మాత్రమే కాకుండా వాటిపై జరిగే ఆసక్తికరమైన సంఘటనలకు కూడా పాపులర్ అయ్యాయి.ఇటీవల రైలు కంపార్ట్‌మెంట్‌లో భోజ్‌పురి సంగీతానికి ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్‌గా మారింది.

ఆమె ప్రదర్శన తోటి ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది, వారిలో కొందరు అసౌకర్యంగా కూడా ఫీలయ్యారు.ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లలేదు.ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ ఈ విషయాన్ని గుర్తించి, విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube