Raadhika Sarathkumar : రాధిక శరత్ కుమార్ ఆస్తుల, అప్పుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే.. అధికారికంగా ఆస్తుల లెక్కలివే!

రాధిక శరత్ కుమార్( Raadhika Sarathkumar ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటిగా రాధిక ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.

 Radhika Sharat Kumar Loans And Assets Value Details Here Goes Viral In Social M-TeluguStop.com

రాధిక ఎక్కువ సంఖ్యలో సీరియళ్లలో నటించడంతో పాటు కొన్ని సీరియళ్లకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తుండగా ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

తమిళనాడులోని విరుదునగర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.తన మొత్తం ఆస్తుల విలువ 53.45 కోట్ల రూపాయలు( Raadhika Sarathkumar Assets Value ) అని రాధిక ప్రకటించారు.33 లక్షల రూపాయల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి 27.05 కోట్ల రూపాయల చరాస్థులు ఉన్నట్టు ఆమె తెలిపారు.నామినేషన్ లో రాధిక వెల్లడించిన ఈ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.26.4 కోట్ల రూపాయల స్థిరాస్థులు ఉన్నాయని ఆమె తెలిపారు.

Telugu Raadhika, Loksabha, Sarathkumar, Tamilnadu-Movie

అదే సమయంలో 14.79 కోట్ల రూపాయల అప్పులు( Raadhika Sarathkumar Debts ) ఉన్నట్టు రాధిక వెల్లడించారు.రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఆమె ఎండీగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు.రాధిక భర్త శరత్ కుమార్( Sarathkumar ) తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేశారు.

ఈ క్రమంలో బీజేపీ నుంచి రాధికకు టికెట్ దక్కడం గమనార్హం.

Telugu Raadhika, Loksabha, Sarathkumar, Tamilnadu-Movie

ఏప్రిల్ నెల 19వ తేదీన తొలి దశలోనే ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది.రాధికకు పోటీగా కెప్టెన్ విజయ్ కాంత్ కుమార్ విజయ ప్రభాకరన్ బరిలోకి దిగారు.తనకు 17.95 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని విజయ్ ప్రభాకరన్( Vijaya Prabhakaran ) ప్రకటన చేశారు.ఎన్నికల్లో రాధిక ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారో లేదో చూడాలి.

రాధిక శరత్ కుమార్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.ఎన్నికల్లో గెలుపు సొంతమవుతుందని రాధిక కాన్ఫిడెన్స్ తో ఉన్నారని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube