Spicy Food : స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే.. ఈ అనర్థాలు భరించక తప్పదు..!

ఈ రోజుల్లో యువత స్పైసి ఫుడ్( Spicy Food ) కి బాగా అలవాటు అవుతుంది.ఇంట్లో వండిన ఆహారాన్ని వదిలి మరీ బయటకి రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తింటున్నారు.

 Spicy Food : స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిం-TeluguStop.com

వారంలో ఏడు రోజులు స్పైసి ఫుడ్ ను తిన్న వారు కూడా ఉన్నారు.ఇలాంటి వారికి తినేటప్పుడు ఆనందం కలుగుతుంది.

కానీ తర్వాత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.స్పైసి ఫుడ్ తినడం వలన కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువగా స్పైసి ఫుడ్ తినడం వలన కడుపు సమస్యలు ఎదురవుతాయి.

మితిమీరిన కారంగా ఉండే ఆహారం ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్, గుండెల్లో మంట ( Heartburn)లాంటి సమస్యలకు దారితీస్తుంది.ఇది జీర్ణ క్రియను ప్రభావితం చేసి కడుపు సమస్యలను కూడా కలిగిస్తుంది.మెరుగైన జీర్ణక్రియ కోసం మంచి పేగు ఆరోగ్యాన్ని కలిగి ఉండడం చాలా అవసరం.

కానీ మసాలాని ఎక్కువగా తినే వ్యక్తులలో పేగులలో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.ఎందుకంటే వాటిలో వేసే సుగంధ ద్రవ్యాలు పేగు గోడలకు అంటుకొని ఇబ్బందిని కలిగిస్తాయి.

స్పైసి ఫుడ్ రుచిని జోడించడానికి ఎక్కువ ఉప్పును కూడా చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు.ఇందులో అధిక మొత్తంలో నూనె కూడా వాడుతారు.

ఇది సిరియల్లో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.తర్వాత అధిక రక్తపోటు( High blood pressure )కు కారణం అవుతుంది.దీంతో అధిక బీపీ వలన గుండె జబ్బులు ఎదురవుతాయి.క్రమం తప్పకుండా స్పైసీ ఫుడ్ తినే వ్యక్తులకు దీర్ఘకాలంలో ఫైల్స్ తో కూడా బాధపడాల్సి ఉంటుంది.

ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పేగు కదలిక సమయంలో లేదా పాయువు నుంచి రక్తస్రావం సమయంలో మంటను ఎదుర్కొంటారు.కాబట్టి వీలైనంత వరకు కచ్చితంగా స్పైసీ ఫుడ్ ను నివారించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube