తిరుపతి జిల్లాలోని టీడీపీలో( TDP ) అసమ్మతి జ్వాల రగులుతోంది.తిరుపతి నియోజకవర్గ టికెట్ దక్కలేదని ఆ పార్టీ నాయకురాలు సుగుణమ్మ( Sugunamma ) కన్నీంటి పర్యంతం అయ్యారు.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని సుగుణమ్మ తెలిపారు.తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమన్న సుగుణమ్మ పార్టీ కోసం కష్టపడిన తనకు కాకుండా వైసీపీ( YCP ) నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులకు ఎన్నికల్లో ఎలా మద్ధతు ఇవ్వాలని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే టికెట్ జనసేనకు కేటాయించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు.