మొబైల్ ఫోన్ లో తీసే ఫోటోలు అందంగా, అద్భుతంగా రావాలంటే ఫోన్ సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేయాలి.అప్పుడు మునప్పటికంటే అందమైన ఫోటోలు తీయొచ్చు.
సెట్టింగ్స్ లో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం.కొంతమందికి మొబైల్ ఫోన్లో ( mobile phone )తరచూ ఫోటోలు తీయడం ఒక అలవాటు.
అలాంటివారు మొబైల్ లో బేసిక్ సెట్టింగ్స్ మార్చుకోవాలి.అంటే ఫోటో ఫ్రేమ్ సైజు 9:16 లేదా 16:9 సెట్ చేయాలి.ఇలా సెట్ చేసుకుంటే ఫుల్ సైజ్ ఇమేజ్ క్యాప్చర్ అవుతుంది.
మొబైల్ సెట్టింగ్స్ లో ఇమేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్లి క్వాలిటీ హై లో ఉందా లేదా అనేది కచ్చితంగా చెక్ చేయాలి.ఎందుకంటే.కొన్ని సందర్భాల్లో ఫోటోలు తీసేటప్పుడు ఎండ లేదంటే లైటింగ్ ఎక్కువగా ఉంటే HDR మోడ్( HDR mode ) ను ఆన్ చేసుకోవచ్చు.ఈ HDR మోడ్ ను ఆన్ చేసి దూరంలో ఉన్న లొకేషన్ లేదంటే దూరంలో ఉన్న వ్యక్తుల ఫోటోలను క్లియర్ గా తీయవచ్చు.
ప్రస్తుతం భారత మార్కెట్లో విడుదల అవుతున్న ఫోన్లు 64 ఎంపీ, 50ఎంపీ కెమెరాలతో ( 64MP , 50MP cameras) వస్తున్నాయి.ఇలా హైయెస్ట్ రిజల్యూషన్ ఉన్న ఫోన్స్ లో వాటికోసం సపరేట్ గా ఆప్షన్ ఉంటుంది.ఆ ఆప్షన్ ను ఆన్ లో ఉంచి ఫోటోలు తీస్తే ఫోటోలు అందంగా వస్తాయి.
ఆప్షన్ ఆన్ లో లేకపోతే డిఫాల్ట్ గా తక్కువ రిజల్యూషన్ తో ఫోటో క్యాప్చర్ అవుతుంది.
కాబట్టి ఫోటోలు తీసే ముందు సెట్టింగ్స్ లో 108ఎంపీ, 54ఎంపీ లలో( 108MP , 54MP ) సెపరేట్ ఫీచర్ కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేయాలి.ఇక కొంతమంది ఫోటోలు బాగా రావాలని జూమ్ చేస్తారు.అలా జూమ్ చేస్తే ఫోటో క్వాలిటీ తగ్గిపోతుంది.
కాబట్టి జూమ్ చేయడం కంటే కాస్త దగ్గరికి వెళ్లి ఫోటో తీయాలి.ఇక అవసరం ఉంటేనే ఫ్లాష్ వాడాలి.
మొబైల్ కెమెరా ఆన్ చేస్తే అక్కడ ఎక్స్ పోజర్ స్కేల్ కనిపిస్తుంది.ఫొటోస్ స్పష్టంగా రావాలంటే ఆ స్కేల్ ఉపయోగించి లైటింగ్ ను తగ్గించడం లేదంటే పెంచడమో చేయాలి.
ఫోటోలు తీసే ముందు లెన్స్ ను ఒకసారి క్లీన్ చేస్తే ఫోటో మరింత స్పష్టంగా వస్తుంది.
తాజా వార్తలు