తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్య( Surya ) హీరోగా వస్తున్న కంగువా సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
అయితే రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచిగా అంచానలైతే ఉన్నాయి.ఇక ఇప్పుడు కంగువ సినిమా( Kanguva Movie ) ఆ తమిళ్ సినిమాకి కాపీగా రాబోతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అది ఏ సినిమా అంటే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘వర్ణ ‘ అనే( Varna Movie ) సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను చేస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

అయితే వర్ణ సినిమాలో ఆర్య, అనుష్క ఇద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఒక యుగం నుంచి ఇంకొక యుగానికి మధ్య ఉండే కనెక్షన్ ను చాలా నీట్ గా చూపించారు.ఇక ఈ కథతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా స్టోరీ ఆ సినిమా స్టోరీ రెండు ఒకటే అయితే మాత్రం సూర్య చేసే ఈ సినిమాకి కొన్ని కష్టాలైతే తప్పవు.అయితే ఈ సినిమా ని డైరెక్టర్ శివ ( Director Shiva ) చాలా రుచిగా తెరకెక్కిస్తున్నట్టుగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇక అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా హెవీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.అలాగే శివ కూడా అజిత్ తో తప్ప మిగతా వాళ్ళతో హిట్టు కొట్టలేడు అనే ఒక బ్యాడ్ నేమ్ ని తన మీద నుంచి తీసేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో సూర్య శివ ఇద్దరు మంచి సక్సెస్ సాధిస్తారా లేదా అనేది చూడాలి…








