రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శనివారం హైదరాబాదులో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం లోని రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
రైతులకు వెంటనే సాగునీరు అందించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టం వాటిల్లిన రైతన్నలకు ప్రభుత్వం తరఫున చేయూతనందించాలని సూచించారు.
ఆయన వెంట ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.







