Canada Diwali Effect : దీపావళి ఎఫెక్ట్.. ఏకంగా ఎన్నికలనే వెనక్కి జరిపే యోచనలో కెనడా సర్కార్

భారతీయుల పండుగలలో దీపావళి( Diwali ) ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.

 Canada Govt Proposes To Delay National Elections Next Year To Avoid Diwali Clas-TeluguStop.com

దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివాళీ.

ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.

తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దివాళీని జరుపుకుంటున్నారు.

ఏకంగా అమెరికా అధ్యక్షుడు కొలువుండే వైట్‌హౌస్‌లోనే( White House ) దీపావళీ వేడుకలు జరుగుతాయి.

మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌లు శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.

అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు దీపావళి నాడు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటిస్తున్నారు.దీనిని బట్టి దీపావళికి దక్కుతున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు.

Telugu Canada Diwali, Canadadiwali, Canada, Canada National, National, Diwali Fe

తాజాగా కెనడా ప్రభుత్వం( Canada Government ) దీపావళిని దృష్టిలో వుంచుకుని ఏకంగా ఎన్నికలనే వాయిదా వేసే దిశగా కసరత్తు చేస్తోంది.షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్ 20న జరగాల్సిన జాతీయ ఎన్నికలను( National Elections ) ఒక వారం వెనక్కి జరపాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.తద్వారా ఆ రోజున దీపావళి పర్వదినాన్ని జరుపుకునే హిందువులు, ఇతర వర్గాలకు వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.పోలింగ్ తేదీని అక్టోబర్ 27కి మార్చాలనే ప్రతిపాదన ఎన్నికల చట్టానికి సంస్కరణల ప్యాకేజీలో భాగం.

ఈ వారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.డెమొక్రటిక్ ఇన్‌స్టిట్యూషన్స్ డిపార్ట్‌మెంట్ ఇతర చర్యలతో పాటు 2025లో నిర్ణీత తేదీ ఎన్నికలకు దీపావళి అడ్డురాకుండా చూసుకోవడం కూడా ఒకటి.

Telugu Canada Diwali, Canadadiwali, Canada, Canada National, National, Diwali Fe

ప్రభుత్వ ప్రతిపాదిత సంస్కరణను హిందూ సమాజం స్వాగతించింది.అయితే హిందూఫోబియాను నియంత్రించడానికి మరింత బలమైన చర్యలను వారు డిమాండ్ చేశారు.అంతేకాదు .ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికార లిబరల్ పార్టీ తమను వారివైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని హిందూ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.ఖలిస్తాన్ అనుకూల అంశవాల పట్ల ప్రధాని జస్టిన్ ట్రూడో( PM Justin Trudeau ) ప్రభుత్వం మెదక వైఖరి అవలంభించడంతో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube