టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) వర్క్ షాప్ నిర్వహించారు.రాష్ట్రం కోసం, దేశం కోసం జట్టు కట్టామన్నారు.
పొత్తుల వలన కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామన్న చంద్రబాబు మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లున్నారని తెలిపారు.పొత్తుల వలన టీడీపీ కోసం పని చేసిన 31 మందికి టికెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు.

అదేవిధంగా కొందరు సీనియర్లకు కూడా టికెట్లు ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు.అయితే టికెట్ల కేటాయింపులో బీసీలకు( BCs ) తగిన ప్రాధాన్యత ఇచ్చేలా చూశామన్నారు.సోషల్ రీ- ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు.







