బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు మరో మూడు రోజుల పాటు ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.
దీంతో ఈ నెల 26 వరకు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో కవిత కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.
ఈ క్రమంలోనే కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ న్యాయస్థానానికి వివరించింది.అనంతరం మరో ఐదు రోజులపాటు కస్టడీ పొడిగించాలని రిమాండ్ రిపోర్టును ఈడీ సబ్మిట్ చేసింది.
మరోవైపు తనపై తప్పుడు కేసులు పెట్టారన్న కవిత.బెయిల్ అప్లికేషన్ దాఖలు చేశారు.కాగా ఈ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించింది.ప్రస్తుతం బెయిల్ కు విచారణ అర్హత లేదని ఈడీ తెలిపింది.







