ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఇలా ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఇకపోతే డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అంతకు ఉన్నటువంటి వారిలో మారుతి( Maruthi ) ఒకరు.
ఈయన 2012వ సంవత్సరంలో ఈరోజుల్లో ( Ee Rojullo ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు దర్శకుడిగా పరిచయమయ్యారు.శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రలలో నటించినటువంటి ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాకు ఎస్కేయన్ , శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మాతలుగా తక్కువ బడ్జెట్ తో నిర్మించి మంచి లాభాలను అందుకున్నారని చెప్పాలి.ఇక ఈ సినిమా 2012 వ సంవత్సరం మార్చి 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా సరిగ్గా విడుదలై 12 సంవత్సరాలు అయిన సందర్భంగా తిరిగి ఈ సినిమాని ఈ మార్చి 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ మారుతికి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా మొదటి సినిమా ఈ రోజుల్లో విడుదల ఈ 12 సంవత్సరాలు అయింది.ఇలా 12 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సినిమా మరోసారి బిగ్ స్క్రీన్ పైకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఈ సినిమాని చాలా సరదాగా చేసామని ఈయన తెలిపారు.అయితే మా జీవితాలను మార్చిన సినిమా ఇదేనని మారుతి వెల్లడించారు.గత 12 సంవత్సరలుగా మా ముగ్గురి జర్నీ కూడా ఎంతో సక్సెస్‌ఫుల్ గా కంటిన్యూ అవుతోంది.ఈ సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా వుంటుందని భావించి మరోసారి విడుదల చేస్తున్నామని ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూసి మళ్లీ ఆనందించాలని కోరుకుంటున్నాను అంటూ మారుతి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







