Raunak Gurjar : తల్లి కోసం సొంత చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన కొడుకు..!

సాధారణంగా తల్లికి పిల్లలపై నిస్వార్ధమైన ప్రేమ ఉంటుంది.ఆమె ప్రేమకు పిల్లలు చాలా కృతజ్ఞతా భావంతో ఉంటారు.

 The Son Who Peeled Off His Own Skin And Sewed Sandals For His Mother-TeluguStop.com

కంటికి రెప్పలా చూసుకున్న తమ తల్లిని సంతోష పెట్టడానికి వారి కోసం ఏదైనా పని చేయాలనుకుంటారు.కొందరు తల్లిపై ప్రేమకు గుర్తుకు ఎవరూ ఊహించని పనులు చేసి తమ పట్ల భక్తిని చాటుకుంటారు.

తాజాగా మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో రౌనక్ గుర్జార్( Raunak Gurjar ) అనే వ్యక్తి తన తల్లి కోసం ఓ అసాధారణమైన భక్తిని ప్రదర్శించాడు.ఈ కొడుకు మతపరమైన పండుగ సందర్భంగా ఆమెకు చాలా ప్రత్యేకమైన బహుమతిని అందించాడు.

అదేంటంటే, తన సొంత చర్మంతో తయారు చేసిన ఒక జత చెప్పులు.

రౌనక్ పవిత్ర హిందూ గ్రంథం, రామాయణం చదువుతూ రాముడి సద్గుణాలలో కొన్నిటిని అలవర్చుకున్నాడు.రాముడు తన సొంత తల్లి కోసం ఎంతో చేశాడు.ఆ విషయాలు తెలుసుకుని రౌనక్ కదిలిపోయాడు, తన తల్లి పట్ల తనకున్న గౌరవాన్ని రాముడిలా వ్యక్తపరచాలని నిర్ణయించుకున్నాడు.

తల్లితండ్రులకు ఎంతో గౌరవం ఇవ్వాలని ప్రజలను కూడా కోరుతున్నాడు.తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన ఉన్నతమైన గౌరవాన్ని సమాజానికి తెలియజేయాలన్నాడు.

రౌనక్ చెప్పులు తయారు చేయించడానికి పెద్ద సాహసమే చేశాడు.చర్మం కోసం తన తొడకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.ఇది తన ఉద్దేశాలను ఎవరికీ తెలియజేయకుండా జరిగింది.చేతిలో చర్మంతో, అతను చెప్పులు తయారు చేయించడానికి స్థానికంగా చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్లాడు.మార్చి 14 నుంచి 21 వరకు జరిగిన ఉజ్జయినిలో వారం రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో తన తల్లికి ప్రత్యేకమైన చెప్పులు అందించాడు.కొడుకు ప్రేమకు ఆ తల్లి బాగా ఎమోషనల్ అయింది.

వారిద్దరికీ సంబంధించిన చిత్రాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు.వాటిలో రౌనక్ తన తల్లి పక్కన కూర్చుని, ఆమెకు చెప్పులు అందజేస్తున్నట్లు కనిపించింది.

రౌనక్ తల్లి నిరుల తన కుమారుడి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.అతనిలాంటి కొడుకు పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు, అతని రక్షణ, ఆనందం కోసం ప్రార్థించారు.

వీరి గురించి తెలుసుకొని చాలామంది ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube