తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy )పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) తీవ్ర ఆరోపణలు చేశారు.కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

విద్యుత్ కొనుగోళ్లపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) మౌనంగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని ఎన్టీపీసీ లేఖలో పేర్కొందన్నారు.గతంలో కేసీఆర్ చేసిన తప్పులనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.







