తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన బాలచందర్ డైరెక్షన్ లో రుద్రవీణ( Rudraveena Movie ) అనే సినిమా చేశాడు.అయితే ఈ సినిమా వేరే హీరోతో చేసి ఉంటే సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేది.
కానీ చిరంజీవి లాంటి మాస్ హీరోతో చేయడం వల్ల ఈ సినిమా అనేది అంత పెద్దగా సక్సెస్ సాధించలేదు.దానికి తగ్గట్టుగా ఈ సినిమాలో కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది.
అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించడం లో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డ్( National Award ) వచ్చినప్పటికి కమర్షియల్ గా మాత్రం డబ్బులు అయితే ఎక్కువగా సాధించలేకపోయింది.

ఇక దానివల్ల ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం అప్పట్లో చిరంజీవి ని విమర్శించారు.ఇక ఈ సినిమాను చిరంజీవి కాకుండా వేరే కమల హాసన్( Kamal Haasan ) లాంటి హీరో చేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది అనవసరంగా చిరంజీవి ఈ సినిమాను చేసి చాలా పెద్ద తప్పు చేశారని చెబుతూ ఉంటారు.కానీ చిరంజీవి కూడా ఆర్ట్ సినిమాలు చేయగలడు అని నిరూపించుకోవడానికి ఈ సినిమాను చేశారు.

చిరంజీవి నటన పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ అది ప్రేక్షకులకు మాత్రం చేరుకోవడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న విశ్వం భర సినిమాలో ఆయన పూర్తి ఎఫర్ట్ పెట్టి నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దానితోపాటు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని మరోసారి క్రియేట్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది…
.







