ఎమ్మెల్సీ కవిత( MLC kavitha )పై ఉన్నవన్నీ ఆరోపణలేనని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలిపారు.ఈ క్రమంలో కవితకు కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా మద్యం కుంభకోణం కేసులో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ ( ED )ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు( Supreme Court )లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది.